ETV Bharat / sports

'ఐపీఎల్ జరగకపోతే ధోనీ కెరీర్​ ప్రశ్నార్థకమే' - dhoni news

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ జరగకపోతే ధోనీకి ఉన్న సమస్యలు మరింతగా పెరుగుతాయని అన్నాడు సీఏసీ సభ్యుడు మదన్​లాల్. కరోనా ప్రభావంతో ప్రస్తుతం ఈ టోర్నీని నిరవధిక వాయిదా వేశారు.

'ఐపీఎల్ జరగకపోతే ధోనీ కెరీర్​ ప్రశ్నార్థకమే'
మహేంద్ర సింగ్ ధోనీ
author img

By

Published : Apr 15, 2020, 1:24 PM IST

భారత్​లో కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే చాలా కార్యక్రమాలు, క్రీడాపోటీల్ని రద్దు చేశారు. దీనితోపాటే లాక్​డౌన్​ను మే 3వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొలుత ఐపీఎల్​ను కొన్ని రోజుల తర్వాత జరపాలని బీసీసీఐ భావించింది. వైరస్​ వ్యాప్తి ఎక్కువవుతుండటం వల్ల టోర్నీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. దీంతో ధోనీ కెరీర్​ సందిగ్ధంలో పడింది. ఇదే విషయంపై మాట్లాడిన క్రికెట్ సలహా మండలి సభ్యుడు మదన్​లాల్.. ఈ లీగ్​ జరగకపోతే మహీకి ఉన్న సమస్యలు ఎక్కువవుతాయని అన్నాడు.

dhoni
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ

"కెరీర్​ పరంగా ధోనీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్​ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్​ అయినా ఆడలేదు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్​ జరగకపోతే అతడి రీఎంట్రీ సమస్యలు మరింత పెరుగుతాయి. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మేనేజ్​మెంట్.. ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు" -మదన్​లాల్, సీఏసీ సభ్యుడు

గతేడాది జరిగిన ప్రపంచకప్​ తర్వాత తాత్కాలిక విరామం ప్రకటించిన ధోనీ.. ఆ తర్వాత జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ కారణంతో అతడిని, బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే ఐపీఎల్​లో మెరుగైన ప్రదర్శన చేసి, టీమిండియాలోకి పునరాగమనం చేయాలనుకున్నాడు మహీ. కానీ ఇప్పుడు కరోనా వల్ల ఆ టోర్నీ వాయిదా పడి, మహీ కెరీర్​ సందిగ్ధంలో పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.