ETV Bharat / sports

'భారత్ వదిలేస్తే టెస్టు క్రికెట్ చచ్చిపోతుంది'

కరోనా ప్రభావం టెస్టు క్రికెట్​పై తీవ్రస్థాయిలో ఉంటుందని అన్నాడు టీమ్​ఇండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్. భారత్​ వదిలేస్తే ఈ ఫార్మాట్ చచ్చిపోతుందని తెలిపాడు.

ఛాపెల్
ఛాపెల్
author img

By

Published : May 14, 2020, 10:09 AM IST

కరోనా మహమ్మారి ప్రభావం టెస్టు క్రికెట్‌పై తీవ్ర స్థాయిలో ఉంటుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. భారత్‌ వదిలేస్తే ఈ ఫార్మాట్ చచ్చిపోతుందని చెప్పాడు.

"భారత్‌ వద్దనుకున్న రోజు టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ కాకుండా మరే దేశం కూడా యువ క్రికెటర్లను టెస్టు క్రికెట్‌వైపు నడిపించడానికి ఖర్చుపెట్టేలా లేవు" అని ఓ ఆన్‌లైన్‌ చాట్‌ సెషన్‌లో ఛాపెల్‌ అన్నాడు.

"టీ20 క్రికెట్‌ అంటే నాకెలాంటి వ్యతిరేకత లేదు. జనాలకు ఆ ఫార్మాట్‌ను అమ్మడం చాలా తేలిక. కానీ టెస్టు క్రికెట్‌కు వచ్చేసరికి డబ్బు ఖర్చు పెట్టడం అనేది సమస్య అవుతుంది. కానీ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. టెస్టు క్రికెట్టే అత్యుత్తమ క్రికెట్‌ అన్నాడు. కాబట్టి టెస్టు క్రికెట్‌ బతుకుతుందని ఆశిస్తున్నా" అని ఛాపెల్ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.