టీమ్ఇండియాకు ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం లేకపోవడం అతి పెద్ద సమస్యగా పేర్కొన్నాడు మాజీ క్రికెటర్ గంభీర్. గతసారి ప్రపంచకప్ జరిగినప్పటి నుంచి ఈ సమస్య జట్టును వెంటాడుతుంటే.. యాజమాన్యం ఎందుకు ఇంకా పరిష్కారం వెతకలేదని ప్రశ్నించాడు. శుక్రవారం ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్ హార్దిక్ బౌలింగ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు గంభీర్.
"గతేసారి ప్రపంచకప్ జరిగినప్పటి నుంచి ఆరో బౌలర్ సమస్య ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కు ఫిట్‌గా లేనప్పుడు అతడి స్థానంలో బౌలింగ్ ప్రత్యామ్నాయం ఏది? ఒకవేళ రోహిత్ శర్మ జట్టులోకి తిరిగొచ్చినా ఆ సమస్యను ఎదుర్కొవాల్సిందే. తొలి ఆరు స్థానాల్లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లో బౌలింగ్ చేసే ఆటగాడు లేడు. అదే ఆస్ట్రేలియా వైపు ఆల్‌రౌండర్లు హెన్రిక్స్, సీన్ అబాట్ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగలరు. కానీ టీమ్ఇండియాలో పరిస్థితి అలా లేదు? హార్దిక్ గాయమైనప్పటి నుంచి ఆ సమస్యను పరిష్కరించకుండా అలానే వదిలేశారు. ఒకవేళ అతడి స్థానాన్ని విజయ్ శంకర్‌తో భర్తీ చేస్తే.. నెం.5 లేదా ఆరు స్థానాల్లో అతడు ప్రభావం చూపే బ్యాటింగ్ చేయగలడా? కచ్చితంగా ఎనిమిది తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేయగలడా?"
-గంభీర్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్.
సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో ఓటమి పాలైంది టీమ్ఇండియా. విజయంలో ఫించ్(114), స్మిత్(105) సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా వన్డే సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇదీ చూడండి : అప్పుడే బౌలింగ్ చేస్తా: హార్దిక్ పాండ్య