ETV Bharat / sports

'నిబంధనల్లో కొన్ని చర్చించాల్సిన అంశాలున్నాయి' - అంతర్జాతీయ క్రికెట్​ మండలి న్యూస్​

తాజాగా ఐసీసీ విడుదల చేసిన మార్గదర్శకాలపై బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబ్​ అల్ హసన్​ స్పందించాడు. నిబంధనల్లో కొన్ని చర్చించాల్సిన అంశాలున్నాయని తెలిపాడు.

ICC won't take a chance before they are sure: Shakib Al Hasan
'నిబంధనల్లో కొన్ని చర్చించాల్సిన అంశాలున్నాయి'
author img

By

Published : May 24, 2020, 7:24 PM IST

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో కొన్ని జవాబు లేని ప్రశ్నలుగా మిగిలాయని నిషేధంలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్​ షకిబ్​ అల్​ హసన్​ అభిప్రాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) నియమనిబంధనలను శుక్రవారం విడుదల చేసింది.​

వీటిలో చీఫ్​ మెడికల్​ ఆఫీసర్లను నియమించడం, మ్యాచ్​లకు ముందు 14 రోజుల ఐసోలేషన్​ శిక్షణా శిబిరం సహా బంతిని అందించేప్పుడు అంపైర్లు చేతికి తొడుగులు ఉపయోగించాలనే నిబంధనలతో పాటు మరికొన్నింటిని అమలు చేయనున్నట్లు తెలిపింది ఐసీసీ. దీనిపై బంగ్లా ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్​ స్పందించాడు.

"3 లేక 6 కాదు ఏకంగా 12 అడుగుల్లోపు ఉన్నా వైరస్​ సోకే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఓవర్​ అయిపోయిన తర్వాత మైదానంలో ఇద్దరు బ్యాట్స్​మెన్లు కలిసి ఎలా చర్చించుకుంటారు? వారు వారి క్రీజ్​లో నిలబడతారా? స్టేడియంలో జనసమూహం ఉండదా? వికెట్ కీపర్ దూరం నిలబడతాడా? దగ్గరగా ఉండే ఫీల్డర్ల పరిస్థితి ఏంటి? ఈ విషయాలపై కచ్చితంగా చర్చ అవసరం.

- షకిబ్​ అల్ ​హసన్​, బంగ్లా​ ఆల్​రౌండర్

ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని సరిగ్గా అంచనా వేయకుండా క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడానికి ఐసీసీ అనుమతించదని షకిబ్​ అభిప్రాయపడ్డాడు. అలాగే ​సమయం తొందరగా గడవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కరోనా సంక్షోభం ఎప్పుడు తగ్గుతుందో అని.. తన సస్పెన్షన్​ ఎప్పుడు ముగుస్తుందో అని ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు.

ఇదీ చూడండి... కరోనా కాలంలో క్రికెట్ మ్యాచ్​ ఇలా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.