అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను మంగళవారం విడుదల చేసింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన, మిథాలీ రాజ్, ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి, ఆల్ రౌండర్ దీప్తి శర్మ తమ స్థానాలను పదిలపరుచుకున్నారు. పేసర్ శిఖా పాండే ఒక స్థానం ఎగబాకి 10వ స్థానం సంపాదించుకుంది.
బ్యాటింగ్ విభాగంలో మంధాన 710 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. మిథాలీ 709 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌కు చెందిన బీమౌంట్ తన అగ్ర స్థానాన్ని కాపాడుకుంది.
బౌలింగ్ విభాగంలో పేసర్ జులన్ గోస్వామి 681 పాయింట్లతో ఐదో స్థానాన్ని, పూనమ్ యాదవ్ 641 పాయింట్లతో 8వ స్థానాన్ని కాపాడుకున్నారు. శిఖా పాండే.. 610 పాయింట్లతో 10వ స్థానానికి ఎగబాకింది. జెస్ జొనాసన్(ఇంగ్లాండ్) ప్రథమ స్థానంలో నిలిచింది.