ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతడు 928 పాయింట్లతో ఉండగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్ 911, లబుషేన్ 827 పాయింట్లతో వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. పుజారా, రహానే 6,8 ర్యాంకుల్లో నిలిచారు. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మాథ్యూస్.. 8 స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరాడు.
బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన కమిన్స్.. 904 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 794 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో 120 పరుగులతో రాణించిన బెన్ స్టోక్స్.. ఆల్రౌండర్ల విభాగంలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదే ఇతడి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు. వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ టాప్లో ఉన్నాడు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 5 ర్యాంకుల్లో నిలిచారు.
ఇవీ చూడండి.. టీ20ల్లో పాకిస్థాన్ రికార్డు.. తొలి జట్టుగా ఘనత