ETV Bharat / sports

కోహ్లీని సమం చేసిన విలియమ్సన్

author img

By

Published : Dec 8, 2020, 7:29 AM IST

న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​.. తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాట్స్​మన్​ ర్యాంకింగ్స్​లో రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో టీమ్​ఇండియా సారథి కోహ్లీతో సమంగా నిలిచాడు.

ICC Test Rankings
విలియమ్సన్

న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ తన మిత్రుడు, టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ర్యాంకుకు ఎసరుపెట్టాడు! ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. కోహ్లీతో సమంగా నిలిచాడు. మరోవైపు వెస్టిండీస్‌ ఆటగాడు జేసన్ హోల్డర్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో పేలవ ప్రదర్శనతో తన తొలి స్థానాన్ని ఇంగ్లాండ్‌ వీరుడు బెన్‌స్టోక్స్‌కు వదిలేశాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 134 పరుగుల తేడాతో ఓడింది. తొలి ఇన్నింగ్స్‌ను కివీస్‌ 519/7 వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (251; 412 బంతుల్లో 34×4, 2×6) తిరుగులేని బ్యాటింగ్‌తో అలరించాడు. ద్విశతకంతో సత్తా చాటాడు. దాంతో తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకున్నాడు. 886 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీతో సమంగా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ 911 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా ఎప్పటిలాగే ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్‌, జో రూట్‌ వరుసగా 8, 9 ర్యాంకుల్లో నిలిచారు. భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌ ఒక్కో స్థానం దిగజారి 11, 12 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టాప్‌-10లో టీమ్‌ఇండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే చోటు సంపాదించాడు. అతడు తొమ్మిదో స్థానంలో నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 11, మహ్మద్‌ షమి 13, ఇషాంత్‌ శర్మ 17, రవీంద్ర జడేజా 18 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడ్డూ 3, అశ్విన్‌ 6 ర్యాంకుల్లో ఉన్నారు. డిసెంబర్​ 17 నుంచి టీమ్‌ఇండియా బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌తో నాలుగు టెస్టుల్లో తలపడనుంది.

ఇదీ చూడండి : కోహ్లీ రికార్డు.. తొలి భారత కెప్టెన్​గా ఘనత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.