విరాట్ కోహ్లీ... క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ.. ఎందరో దిగ్గజాల రికార్డులను అలవోకగా అధిగమిస్తున్నాడు. ఫార్మాట్‌తో పని లేకుండా బ్యాట్‌కు పనిచెప్పే ఈ టీమిండియా సారథి... అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ స్టార్ బ్యాట్స్‌మన్.. మూడు ఫార్మాట్లలో టాప్-10లో నిలిచిన ఏకైక క్రికెటర్‌గా ఘనత సాధించాడు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టాప్-15లో ఉండేవాడు విరాట్. కరీబియన్ జట్టుపై జరిగిన 3 మ్యాచ్‌ల్లో 94*, 19, 70 పరుగులు చేసి మొత్తంగా 183 రన్స్ సాధించాడు. ఈ ప్రదర్శన కారణంగా 5 స్థానాలు ఎగబాకి 685 పాయింట్లతో పదో స్థానం దక్కించుకున్నాడు.
-
KL Rahul ⬆️
— ICC (@ICC) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli ⬆️
After their 💥 performances against West Indies, the Indian duo have risen in the @MRFWorldwide ICC T20I Rankings for batting.
Updated rankings ▶️ https://t.co/EdMBslOYFe pic.twitter.com/90fnJGtksp
">KL Rahul ⬆️
— ICC (@ICC) December 12, 2019
Virat Kohli ⬆️
After their 💥 performances against West Indies, the Indian duo have risen in the @MRFWorldwide ICC T20I Rankings for batting.
Updated rankings ▶️ https://t.co/EdMBslOYFe pic.twitter.com/90fnJGtkspKL Rahul ⬆️
— ICC (@ICC) December 12, 2019
Virat Kohli ⬆️
After their 💥 performances against West Indies, the Indian duo have risen in the @MRFWorldwide ICC T20I Rankings for batting.
Updated rankings ▶️ https://t.co/EdMBslOYFe pic.twitter.com/90fnJGtksp
కేఎల్ రాహుల్(734 పాయింట్లు) ఆరో స్థానంలో, రోహిత్ శర్మ(686) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ ఉండటం విశేషం.
రికార్డులే రికార్డులు
టీ20ల్లో అత్యధిక పరుగులు(2633) చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి అగ్రస్థానం పంచుకున్నాడు కోహ్లీ. భారత స్టార్ ఓపెనర్ రోహిత్.. ఈ స్కోరును 104 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, కోహ్లీ 75 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. అంతేకాకుండా వరుసగా నాలుగో ఏడాది ఈ ఫార్మాట్లో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
విండీస్‌తో సిరీస్‌లో 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్న కింగ్ కోహ్లీ... అత్యధిక సార్లు(6) ఈ ఫార్మాట్లో అవార్డు అందుకున్న బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో 50 శాతం కన్నా ఎక్కువ సగటుతో ఉన్న క్రికెటర్‌గా ఓ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో ఈ ఫార్మాట్లో వెయ్యి పరుగులకు(1064) పైగా చేసిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.
కోహ్లీ.. ఇప్పటివరకు 84 టెస్టులు ఆడి 7202 పరుగులు చేశాడు. 239 వన్డేల్లో 11520, 75 టీ20ల్లో 2633 పరుగులు సాధించాడు.
ఇవీ చూడండి...