ETV Bharat / sports

భారత్​Xఇంగ్లాండ్​​​ సెమీస్​కు వరుణుడి దెబ్బ... టాస్​ ఆలస్యం - India vs England, ICC T20 World Cup Semi-Final

భారత్​-ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన​ మ్యాచ్​ వర్షం ఆటంకంగా మారింది. ఉదయం 9 గంటలకే టాస్​ పడాల్సి ఉన్నా, వరుణుడి ప్రతాపం వల్ల ఆట ఇంకా మొదలుకాలేదు. 11 గంటల తర్వాత పరిస్థితి సమీక్షించనున్నారు.

ICC T20 World Cup Semi-Final
భారత్​Xఇంగ్లాండ్​​​ సెమీస్​కు వరుణుడి దెబ్బ... టాస్​ ఆలస్యం
author img

By

Published : Mar 5, 2020, 9:15 AM IST

మహిళల టీ20 ప్రపంచకప్​లో భాగంగా నేడు జరగాల్సిన భారత్​-ఇంగ్లాండ్​ సెమీఫైనల్​..​ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు టాస్​ వేయాల్సి ఉన్నా.. వరుణుడి వల్ల ఆట మొదలవ్వలేదు. ఉదయం 11 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించి, మ్యాచ్​ను 10 ఓవర్లకు కుదించనున్నారు అంపైర్లు.

  • ☔ India v England weather update

    To complete a 10 over a side match, the toss must be held by 4.36pm local time, and play must commence by 4.51pm local time.

    We will keep you updated as the day progresses.#INDvENG | #T20WorldCup pic.twitter.com/MVUfMBcuC4

    — T20 World Cup (@T20WorldCup) March 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రద్దయితే భారత్​ ఫైనల్​కు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ మొదలైనప్పటి నుంచి భారత్.. ఒక్కసారైనా ఫైనల్‌ చేరలేదు. 2018లో హర్మన్‌ప్రీత్‌ సేన.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో ఓడిపోయింది. ప్రస్తుత టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా దూసుకెళ్తున్న మహిళా టీమిండియా.. ఇప్పటికే వరుసగా నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటింది. ఫలితంగా గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో నిలవగా, ఆసీస్‌ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

మరోవైపు గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఈ నాలుగు జట్లు సిడ్నీ క్రికెట్‌ మైదానంలో నేడు సెమీస్‌లో తలపడనున్నాయి.

తొలుత భారత్‌xఇంగ్లాండ్‌ తలపడనుండగా, అదే వేదికపై దక్షిణాఫ్రికా x ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. ప్రస్తుతం సిడ్నీలో వర్షం పడుతోంది. ఒకవేళ వరుణుడి ప్రభావంతో సెమీస్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారితే.. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు లాభం చేకూరనుంది. ఈ రెండూ గ్రూప్‌ దశలో టాప్‌లో ఉన్నందున నేరుగా ఫైనల్‌ చేరతాయి.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ టీ20 మ్యాచ్‌ నిర్వహించాలంటే.. ఇరు జట్లు కనీసం ఐదు ఓవర్ల పాటు ఆడాలి. అదే ఐసీసీ టోర్నీల్లో అయితే.. 10 ఓవర్ల చొప్పున ఆడాలి. వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడి నిర్ణీత ఓవర్ల పాటు సాగకపోతే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. ఇవాళ జరిగే మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా మారితే.. ఆదివారం భారత్‌ X దక్షిణాఫ్రికా తుది సమరంలో తలపడనున్నాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.