ETV Bharat / sports

'కంకషన్​ నిర్ణయానికి తటస్థ వైద్యుడు అవసరం' - ఐసీసీ వార్తలు

కంకషన్​​ సబ్​స్టిట్యూట్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఓ సరైన నిర్ణయం తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ మార్క్​ వా అభిప్రాయపడ్డాడు. దీని కోసం ఇరుజట్లకు ఓ తటస్థ వైద్యుడ్ని నియమించాల్సిన అవసరం ఉందని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.

ICC should look at employing neutral doctor to make concussion call, Says Mark Waugh
'కంకషన్​ నిర్ణయానికి తటస్థ వైద్యుడు అవసరం'
author img

By

Published : Dec 6, 2020, 5:52 PM IST

క్రికెట్​లో కంకషన్​ సబ్​స్టిట్యూట్​పై ఐసీసీ సరైన నిర్ణయం తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్​మన్​ మార్క్​ వా అభిప్రాయపడ్డాడు. ఇందుకోసం మ్యాచ్​లో తలకు గాయాలను పరిశీలించడానికి ఇరుజట్లకు ఓ తటస్థ వైద్యుడ్ని నియమించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.

"కంకషన్​పై ఓ నిర్ణయానికి వచ్చే ముందు ఇరుజట్లకు ఓ తటస్థ వైద్యుడ్ని నియమించే అవసరం ఉందని నేను భావిస్తున్నా. భారత జట్టు వైద్యుడు కచ్చితంగా వాళ్లు చెప్పినట్లే వింటాడు. అయితే ఆ వైద్యుడి నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదు. ఇరుజట్ల మధ్య ఓ తటస్థ వైద్య అధికారిని నియమించే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం."

- మార్క్​ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఇటీవలే ఆస్ట్రేలియా, టీమ్​ఇండియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా తలకు బంతి తగిలింది. తర్వాత అతడు అస్వస్థతకు గురవడం వల్ల ఆ స్థానంలో చాహల్​ను కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా బరిలోకి దించారు. శుక్రవారం కాన్​బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది. కంకషన్​ సబ్​స్టిట్యూట్​గా వచ్చిన చాహల్​ (3/25) మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కారణమయ్యాడు.

అయితే కంకషన్​​ నిర్ణయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ మార్క్​ టేలర్​తో పాటు భారత మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ విమర్శలు చేశారు. మ్యాచ్​ జరిగే సమయంలో కంకషన్​ సబ్​స్టిట్యూట్​పై ఆసీస్​ ప్రధానకోచ్​ జస్టిన్​ లాంగర్​ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: ''కంకషన్​ సబ్​స్టిట్యూట్​'ను దుర్వినియోగం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.