ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు అప్పుడు వరం.. ఇప్పుడు శాపం

వన్డే పురుషుల ప్రపంచకప్​ గెలిచిన ఇంగ్లాండ్​ జట్టుకు ఒకప్పుడు విజయం అందించిన ఐసీసీ రూల్​.. నేటి మహిళా టీ20 వరల్డ్​కప్​లో షాకిచ్చింది. అప్పటి నిబంధన కారణంగా బౌండరీ కౌంట్​తో గెలిచిన ఇంగ్లీష్​ జట్టు.. నేటి మ్యాచ్​లో భారత్​ చేతిలో పరుగులేమి చేయకుండా ఓడిపోయింది.

ICC Rules that have become a curse to England
అప్పుడు సున్నాతో గెలిచి... ఇప్పుడు జీరోగా ఓడింది!
author img

By

Published : Mar 5, 2020, 5:45 PM IST

గతేడాది జరిగిన పురుషుల వన్డే ప్రపంచకప్​ ఫైనల్లో న్యూజిలాండ్​పై సున్నా పరుగుల తేడాతో గెలిచింది ఇంగ్లాండ్​. ఆ మ్యాచ్​లో తొలుత స్కోర్లు సమం కాగా.. సూపర్​ ఓవర్​ నిర్వహించారు. ఇందులోనూ పరుగులు సమానం కావడం వల్ల బౌండరీ కౌంట్​ ఆధారంగా ఇంగ్లీష్​ జట్టు తొలిసారి కప్పు గెలిచింది. అయితే అప్పుడు ఐసీసీ నిబంధనల కారణంగా విజేతగా నిలిచిన ఇంగ్లాండ్​... నేడు అదే రూల్ కారణంగా మహిళా ప్రపంచకప్​లో ఓటమి మూటగట్టుకుంది.

ఇంగ్లాండ్ ఇలా ఇంటికి...

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్‌ చేరింది. భారత్‌ X ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హర్మన్‌ప్రీత్‌సేన సెమీస్‌ ఆడకుండానే నేరుగా తుది పోరుకు అర్హత సాధించింది. గత టీ20 ప్రపంచకప్‌ సెమీస్​లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా.

ICC Rules that have become a curse to England
2019 ప్రపంచకప్​ గెలిచిన ఇంగ్లాండ్​ పురుషుల జట్టు

ప్రస్తుత టోర్నీలో భారత్​ గ్రూప్‌-ఎలో వరుసగా నాలుగు లీగ్ మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా సెమీఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తలపడాల్సి వచ్చింది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీస్‌ రద్దవ్వడం వల్ల లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన హర్మన్‌ప్రీత్‌ జట్టు ఫైనల్స్‌కు చేరింది. రన్‌రేట్‌ పరంగా ఇంగ్లాండ్‌ (+2.291), భారత్‌(+0.097) కన్నా మెరుగ్గా ఉండటం గమనార్హం. లీగ్​ల్లో ఒక్క మ్యాచ్​ ఓడినా భారత్​ ఇంటికి వెళ్లిపోయేది.

ఇదీ చూడండి.. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్​ రద్దు.. ఫైనల్​కు హర్మన్​సేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.