ETV Bharat / sports

కోహ్లీ అగ్రస్థానంలో.. టాప్​-50లోకి పాండ్య - ind vs aus series

ఐసీసీ గురువారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య టాప్-50లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ICC ODI ranking: Kohli and Rohit occupy top two spots, Bumrah third in bowlers' list
కోహ్లీ అగ్రస్థానంలో.. టాప్​-50లోకి పాండ్య
author img

By

Published : Dec 10, 2020, 5:22 PM IST

భారత్-ఆస్ట్రేలియా సిరీస్​లో అదరగొట్టిన పలువురు క్రికెటర్లు.. తమ వన్డే ర్యాంకుల్ని మెరుగుపరుచుకున్నారు. టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ.. బ్యాట్స్​మన్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సిరీస్​కే ఎంపికవ్వని రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్​లో బుమ్రాలో ఒక స్థానం కోల్పోయి మూడుకు చేరుకున్నాడు.

ICC ODI ranking latest
టీమ్​ఇండియా బౌలర్ బుమ్రా

2019 ప్రపంచకప్​ తర్వాత ఈ వన్డే సిరీస్​ ఆడిన ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. తొలి, మూడో మ్యాచ్​ల్లో వరుసగా 90, 92* పరుగులు చేసి మెప్పించాడు. దీంతో టాప్-50లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్​లోనే అత్యుత్తమంగా 553 పాయింట్లతో 49వ ప్లేస్​కు చేరుకున్నాడు.

ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ ఫించ్ రెండు స్థానాలు ఎగబాకి ఐదుకు, ఒక స్థానం మెరుగుపర్చుకున్న వార్నర్ ఏడుకు చేరుకున్నారు. వన్డేల్లో రెండు సెంచరీలు చేసిన స్మిత్.. 2018 తర్వాత టాప్-20లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం 707 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.