2019 ప్రపంచకప్.. ఎన్నో తీపి గురుతులు, మరెన్నో చేదు జ్ఞాపకాలని మిగిల్చింది. కప్పు కొట్టాలనే ఆశతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌లో నిష్క్రమించింది. ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిసారి విజేతగా నిలిచింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కారణం.. అత్యధికులు వీక్షించిన టోర్నీగా ఈ ప్రపంచకప్ నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం వేర్వేరు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లో కలిపి సుమారు 3.5 బిలియన్ల వీక్షణలు నమోదయ్యాయి. ఆ సమయంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ల్లోనూ ఈ వీడియోలదే హవా.
ఐసీసీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 2.3 బిలియన్(230 కోట్ల) నిమిషాల సమాచారాన్ని, ఫేస్బుక్ పేజ్‌లో 1.2బిలియన్ల(120 కోట్ల) నిమిషాల వీడియోలను నెటిజన్లు వీక్షించారు.
ఎక్కువ మంది చూసిన వీడియో ఇదే
ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను హేళన చేయడం మొదలుపెట్టారు టీమిండియా అభిమానులు. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతడిని దూషించడానికి బదులు చప్పట్లు కొట్టి ప్రశంసించాలని చెప్పాడు. ఐసీసీ ట్విట్టర్ పేజ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా రికార్డు సృష్టించింది.
-
With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
— ICC (@ICC) June 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjr
">With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
— ICC (@ICC) June 9, 2019
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjrWith India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
— ICC (@ICC) June 9, 2019
Absolute class 👏 #SpiritOfCricket #ViratKohli pic.twitter.com/mmkLoedxjr
అత్యధిక ట్వీట్స్ వచ్చిన మ్యాచ్ ఇదే..!
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండగా 2.9 మిలియన్ల ట్వీట్స్ చేశారు నెటిజన్లు. ట్విట్టర్లో అత్యధిక పోస్ట్‌లు వచ్చిన వన్డేగా ఈ మ్యాచ్ నిలిచిపోయింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఈ జాబితాలో రెండో స్థానం సొంతం చేసుకుంది. టీమిండియా-న్యూజిలాండ్ సెమీస్ పోరు మూడో స్థానంలో నిలిచింది.
ప్రపంచకప్ జరుగుతుండగా సామాజిక మాధ్యమాల్లో.. ఐసీసీ, సీడబ్యూసీ ఛానెల్స్‌కు కొత్తగా 14 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.
హాష్ ట్యాగ్ ట్వీట్స్ 100 శాతం పెరుగుదలట
మే 20 నుంచి జూలై 15 వరకు #CWC19 అనే హాష్‌ట్యాగ్‌తో 31 మిలియన్ల ట్వీట్స్ నమోదయ్యాయి. ఇది గత ప్రపంచకప్ #CWC15 కంటే 100 శాతం పెరుగుదల నమోదు చేసింది.
ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో ఐసీసీ యాప్‌లో 41 మిలియన్లకు పైగా ఫాంటసీ జట్లు తయారు చేశారు ఫాలోవర్స్.
ఇది చదవండి: భాజపా సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్‌కు క్రీడా సమాజం కన్నీటి నివాళి