ఐసీసీ ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును.. భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ఇండియా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు పంత్. ఆ సిరీస్‌లో 97, 89 పరుగులు చేసి భారత విజయానికి దోహదం చేశాడు.
ఏ ఆటగాడైనా జట్టును గెలిపించడమే గొప్ప రివార్డుగా భావిస్తాడు. నాలాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇటువంటి అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియా సిరీస్ విజయంలో సభ్యులైన ప్రతి ఇండియా క్రికెటర్‌కు ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
-రిషభ్‌పంత్, భారత వికెట్‌కీపర్
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో చిక్కుకున్న జట్టును 91 పరుగులు చేసి ఆదుకొనే ప్రయత్నం చేశాడు.
పంత్‌ను అవార్డు వరించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందించాడు. 'అతడు ఆడిన రెండు సందర్భాలు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవి. రెండింటిలోనూ అద్భుత నైపుణ్యం కనబరిచాడు. ఒక మ్యాచ్‌లో గెలుపొందిన భారత్, మరో టెస్టును డ్రా చేసుకుంది' అని తెలిపాడు.
ఇదీ చదవండి: ఐసీసీ ప్రపంచ భాగస్వామిగా బైజూస్