యాషెస్ నాలుగో టెస్టు తర్వాత టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది ఐసీసీ. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ తొలిస్థానం సంపాదించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన యాషెస్ నాలుగో టెస్టులో 185 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు స్మిత్. రెండు ఇన్నింగ్స్‌ల్లో 211, 82 పరుగులతో రాణించిన ఈ క్రికెటర్.. ప్రస్తుతం 937 పాయింట్లతో ఉన్నాడు.
టీమిండియా సారథి కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య 34 పాయింట్ల అంతరం ఉంది. జాస్ బట్లర్ (37), రోరీ బర్న్స్(61), ఇంగ్లాండ్ కెప్టెన్ టిమ్ పైన్ (60) ర్యాంకులు మెరుగుపర్చుకున్నారు.
-
◾ Steve Smith & Pat Cummins retain their 🔝 positions
— ICC (@ICC) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
◾ Afghanistan players make big gains 👏@MRFWorldwide ICC Test Rankings after #BANvAFG and the fourth #Ashes Test ⬇️https://t.co/fcld2lmvQj
">◾ Steve Smith & Pat Cummins retain their 🔝 positions
— ICC (@ICC) September 10, 2019
◾ Afghanistan players make big gains 👏@MRFWorldwide ICC Test Rankings after #BANvAFG and the fourth #Ashes Test ⬇️https://t.co/fcld2lmvQj◾ Steve Smith & Pat Cummins retain their 🔝 positions
— ICC (@ICC) September 10, 2019
◾ Afghanistan players make big gains 👏@MRFWorldwide ICC Test Rankings after #BANvAFG and the fourth #Ashes Test ⬇️https://t.co/fcld2lmvQj
కమిన్స్ టాపర్...
ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ బౌలింగ్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. యాషెస్ నాలుగో టెస్టులో 103 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ఫలితంగా కెరీర్లో అత్యుత్తమంగా 914 పాయింట్లతో నిలిచాడు. ఈ గణాంకాలతో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ సరసన చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ రెండవ ర్యాంక్‌లో ఉన్నాడు. బుమ్రా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ బౌలర్ హెజిల్వుడ్ (10) టాప్-10లో చోటు సంపాదించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 224 పరుగుల తేడాతో విజయం సాధించింది అఫ్గాన్ జట్టు. ఫలితంగా ఆ దేశ ఆటగాళ్ల ర్యాంకులూ మెరుగుపడ్డాయి. కెప్టెన్ రషీద్ ఖాన్(37), మాజీ సారథి ఆస్గర్ అఫ్గాన్ (63), రహ్మత్ షా(65) స్థానాలు సంపాదించారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ నబీ (85), బంగ్లా ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్(21) స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి...