క్రైస్ట్‌చర్చ్ ఘటన అనంతరం ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, వీక్షించేందుకు వచ్చే ప్రజల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. న్యూజిలాండ్‌లోని ఇక్కడి మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిలో 50 మంది పౌరులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో బంగ్లాదేశ్ క్రికెటర్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అనంతరం కివీస్‌తో టెస్ట్‌ను రద్దుచేసుకొని స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ మ్యాచ్ రద్దుకు ఐసీసీ సైతం ఆమోదం తెలిపింది.
- ఆదివారం కరాచీలో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఫైనల్‌కు హాజరయ్యారు ఐసీసీ సీఈవో రిచర్డ్సన్. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన వన్డే ప్రపంచకప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.
‘న్యూజిలాండ్ ఘటన బాధాకరం. కానీ ప్రపంచకప్ లాంటి పెద్ద ఈవెంట్సెక్యూరిటీ విషయంలో ఐసీసీ చాలా జాగ్రత్త వహిస్తోంది. వరల్డ్‌కప్ జరగనున్న వేదికల్లో భద్రతపై ఇప్పటికే యూకే, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆ దేశ భద్రతా వ్యవస్థలతో చర్యలు ప్రారంభించారు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన దాడి తర్వాత రక్షణ ఏర్పాట్లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు’
-ఐసీసీ సీఈవో, రిచర్డ్సన్