దాదాపు 117 రోజుల నుంచి మైదానానికి దూరమైన క్రికెటర్లు.. బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. రేపటి(జులై 8) నుంచి ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌ను బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పక్కగా చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే ప్రశంసించారు. భద్రత చర్యల విషయంలో వారు చేసిన కృషిని మెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఇరుజట్ల ఆటగాళ్లు.. ఏజెల్ బౌల్ స్టేడియానికి సంబంధించిన హోటల్లో ఉన్నారు. దీని తర్వాత జరిగే రెండు మ్యాచ్‌లు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనున్నాయి.