కరోనా కారణంగా చాలా క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో టోర్నీలు నిర్వహించడంపై చాలా కసరత్తులు చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. తాజాగా భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి నేడు సమావేశం కానుంది.
"భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి ఐసీసీ శుక్రవారం సమావేశం కానుంది. అలాగే ఐసీసీ ఛైర్మన్ పదవితో పాటు వచ్చే ఏడాది జరిగే మహిళా ప్రపంచకప్‌పై చర్చించేందుకు బోర్డు సభ్యులు సిద్ధంగా ఉన్నారు."
-ఐసీసీ అధికారి
జులై 1న ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఆ పదవికి రాజీనామా చేశారు. కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేవరకు వైస్ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా.. మనోహర్ పదవిలో కొనసాగనున్నారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ 2021 నవంబర్‌కు వాయిదా పడింది. అలాగే భారత్‌లోనూ 2022 టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ రెండు టోర్నీలపై స్పష్టత కోసం ఐసీసీ ఈ మీటింగ్‌లో చర్చించనుంది.