ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వల్ల వెస్టిండీస్ క్రికెటర్లు చాలా లాభపడ్డారని అన్నాడు ఆ దేశ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్. తమ దేశానికి చెందిన చాలామంది ఆటగాళ్లకు ఈ లీగ్.. ఆర్థికపరమైన రక్షణ కల్పించిందని తెలిపాడు. విండీస్ ప్రముఖ క్రికెటర్లు అంతర్జాతీయ జట్టులో చోటు కోల్పోయినందుకు బాధపడుతున్నా సరే ఐపీఎల్లో లభించే నగదుతో కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటున్నారని చెప్పాడు. ద్వీప దేశ క్రికెటర్లపై ఈ టోర్నీ సానుకూల ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.
"భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని క్రికెటర్, ఆర్థికంగా మెరుగవడాన్ని చూసి ఎప్పుడూ అసూయపడను. నేను కోరుకున్నట్లుగా వారు వెస్టిండీస్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కానీ కుటుంబ భద్రత కోసం ఐపీఎల్లో ఆడటం లాంటి నిర్ణయాలు తీసుకోవడం నాకు సంతోషం కలిగించింది"
ఇయాన్ బిషప్, వెస్టిండీస్ మాజీ బౌలర్
ఐపీఎల్‌తో పాటు పలు టీ20 లీగ్‌ల్లో ఆడి క్రిస్ గేల్, పొలార్డ్, బ్రావో, నరైన్ తదితరులు ఎంతో ప్రాచుర్యం పొందారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చెల్లించే నగదు కంటే.. ఈ టోర్నీల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీటికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
క్రికెటర్ల అవసరాలను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సరిగ్గా అర్థం చేసుకోలేదని బిషప్ అభిప్రాయపడ్డాడు. టీ20ల ప్రాధాన్యం కూడా తెలుసుకోలేకపోయిందని తెలిపాడు.