ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరిగి భాగమవుతుండటం ఉద్వేగంగా ఉందని టీమ్‌ఇండియా నయావాల్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కెప్టెన్ ధోనీ కిందే లీగులో పునరాగమనం చేయడం అదృష్టమని పేర్కొన్నాడు. టీ20 క్రికెటర్‌గా తనకు అతిగా రేటింగ్ ఇచ్చుకోవడం లేదన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ అవకాశాలు వస్తే జనాల దృక్పథం మారుతుందని వెల్లడించాడు.
టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడ్డ పుజారా ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నాడు. ఈ సీజన్ వేలంలో రూ.50 లక్షల కనీస ధరకు చెన్నై సూపర్‌కింగ్స్ అతడిని తీసుకుంది. అతడిని తీసుకున్న వెంటనే మిగతా ఫ్రాంచైజీలన్నీ చప్పట్లతో అభినందనలు తెలిపాయి. "పుజారా లాంటి జాతీయ హీరోకు నిరాశ కలగనీయం" అన్న సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ వ్యాఖ్యలపై చెతేశ్వర్ స్పందించాడు.
"జాతీయ జట్టుకు మంచి ప్రదర్శనలు చేసిన వారిని గౌరవించే ఫ్రాంచైజీకి ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. మహీ భాయ్ సారథ్యంలో పునరాగమనం చేయడం నా అదృష్టం. నా అంతర్జాతీయ అరంగేట్రం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సుదీర్ఘకాలం క్రికెట్‌తో అనుబంధం ఉన్న శ్రీనివాసన్ నా గురించి అలా మాట్లాడటం గొప్పగా అనిపించింది. ఇది నాకో భావోద్వేగ సందర్భం."
-పుజారా, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు
"టీ20 ఆటగాడిగా నాకు అతిగా రేటింగ్ ఇచ్చుకోను. టీ20 క్రికెటర్‌గా నేనెక్కడ నిలబడతానో తెలియదు. కానీ ఒక క్రికెటర్‌గా మాత్రం మెరుగైన స్థానంలో ఉంటాను. అంతర్జాతీయ క్రికెట్ అనుభవంతో పొట్టి క్రికెట్లో రాణించగలనన్న నమ్మకం ఉంది. సరైన జట్టులో నేను ఉన్నానని అనిపిస్తోంది. ఫ్రాంచైజీ, కెప్టెన్, సహాయ సిబ్బంది, ఇంకా చాలామంది నన్ను నడిపించగలరు. నేనిప్పుడు ఆటను మరింత బాగా అర్థం చేసుకుంటున్నాను" అని పుజారా అన్నాడు.
"క్రికెట్ ఆడటం నాకిష్టం. ఏ ఫార్మాట్‌నూ మిస్సవ్వాలని నేను కోరుకోను. ఇప్పుడు ఐపీఎల్‌లో భాగమవ్వడం సంతోషంగా ఉంది. క్రికెటర్‌గా మరింత ఎదిగేందుకు ఇది నాకు సాయపడుతుంది. అవును, నేను టెస్టు స్పెషలిస్టు అన్న ముద్ర పడింది. మిగతా ఫార్మాట్లలో మరిన్ని అవకాశాలు వస్తే అలాంటి దృక్పథం పోతుంది. అలాగని ప్రపంచకప్‌లో ఇవ్వాలని కాదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ అవకాశాలు ఇస్తే మెరుగైన వన్డే క్రికెటర్‌గా ఎదగగలను. అందులో సందేహానికి తావులేదు" అని పుజారా ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, సీఎస్‌కే శిబిరంలో సరికొత్త స్టాన్స్‌తో పుజారా సిక్సర్లు కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
-
Puji was on fire 🔥@cheteshwar1 #csk pic.twitter.com/CNbPXi786q
— Ravi Desai 🇮🇳 Champion CSK 💛🏆 (@its_DRP) March 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Puji was on fire 🔥@cheteshwar1 #csk pic.twitter.com/CNbPXi786q
— Ravi Desai 🇮🇳 Champion CSK 💛🏆 (@its_DRP) March 30, 2021Puji was on fire 🔥@cheteshwar1 #csk pic.twitter.com/CNbPXi786q
— Ravi Desai 🇮🇳 Champion CSK 💛🏆 (@its_DRP) March 30, 2021