ETV Bharat / sports

ఐపీఎల్​: రైనా స్థానంలో బరిలోకి రాయుడు! - రాయుడు

ఐపీఎల్​లో రైనా లేకపోవడం సీఎస్కే జట్టుకు పెద్ద లోటుగా మారింది. అయితే, రైనా స్థానానికి న్యాయం చేయగలిగేది అంబటి రాయుడే అని న్యూజిలాండ్​ మాజీ క్రికెటర్​ స్కాట్ స్టైరిస్​ అభిప్రాయపడ్డాడు.

CSK
రైనా
author img

By

Published : Sep 11, 2020, 7:29 PM IST

ఐపీఎల్​ నుంచి సురేశ్ రైనా వైదొలిగిన తర్వాత ఆ స్థానంలో సీఎస్కే తరఫున ఎవరు ఆడతారని అటు ఫ్రాంచైజీతో పాటు, అభిమానులూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ఆటగాళ్ల పేర్లు వినిపించాయి. అయితే, రైనా తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్​ చేసేందుకు అంబటి రాయుడు సరైన వ్యక్తి అని న్యూజిలాండ్​ మాజీ ఆల్​రౌండర్​ స్కాట్​ స్టైరిస్​ అభిప్రాయపడ్డాడు.

CSK
ఐపీఎల్​లో రైనా ఘనతలు

ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల రైనా అకస్మాత్తుగా లీగ్​ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రైనా లేకపోవడం సీఎస్కే జట్టుకు పెద్ద లోటుగా భావించిన స్కాట్​.. అతడికి ప్రత్యామ్నాయంగా సరిపోలిన ఆటగాడిని కనుగొనడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. మరి రైనా స్థానంలో ఎవరు బరిలోకి దిగనున్నారో తెలియాలంటే ఐపీఎల్​ ప్రారంభమయ్యే వరకు వేచి చూడక తప్పదు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న లీగ్ మొదలవనుంది. తొలి మ్యాచ్​లో సీఎస్కే, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.