ETV Bharat / sports

'స్కూప్​ షాట్​పై డివిలియర్స్​ ఎలా స్పందిస్తాడో?' - భారత్Xఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్​ 15వ ఓవర్లో స్కూప్​ షాట్​ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ. ఈ​ షాట్​పై ఆర్సీబీ సహచరుడు, తన మిత్రుడు ఏబీ డివిలియర్స్​ స్పందన అడిగి తెలుసుకుంటానని అన్నాడు.

kohli
'స్కూప్​ షాట్​ పై డివిలియర్స్​ ఎలా స్పందిస్తాడో?'
author img

By

Published : Dec 6, 2020, 9:36 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన స్కూప్​ షాట్​ ఆడాడు. మ్యాచ్​ అనంతరం సరదాగా స్పందించిన టీమ్​ఇండియా సారథి.. దీనిపై డివిలియర్స్ స్పందన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుంటానని చెప్పాడు.

ఆండ్రూ టై వేసిన 15వ ఓవర్లో కోహ్లీ.. స్టంప్స్​ను వదిలేసి స్క్వేర్​ లెగ్​ మీదుగా సిక్సర్​ బాదాడు. అయితే.. ఇలాంటి షాట్స్​ ఎక్కువగా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్​మన్, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులో కోహ్లీ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆడుతుంటాడు.

"బహుషా.. నేను ఆడిన ఆ షాట్​లో ఏబీ డివిలియర్స్​ కనిపించి ఉంటాడు. ఇలాంటి షాట్ ఆడుతానని అస్సలు ఊహించలేదు. హార్దిక్​తో కూడా అదే చెప్పాను. టీమ్​ఇండియా జట్టు ఆటగాళ్లు కూడా ఆ స్కూప్​ షాట్ ఊహించి ఉండరు. ఈ షాట్​​ గురించి ఏబీకి ఈరోజే ఓ మెసేజ్​ చేస్తా. తను ఎలా స్పందిస్తాడో చూడాలి! ".

-విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి.

నెటిజన్ల స్పందన

విరాట్​ సిక్సర్​ కొట్టిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏబీ డివిలియర్స్​ను గుర్తుచేశాడు అంటూ కామెంట్స్​ చేస్తున్నారు.

kohli
ఓ నెటిజన్​ స్పందన

ఈ స్కూప్​ షాట్​పై క్రికెట్​​ ఆస్ట్రేలియా సైతం స్పందించింది. ఈ షాట్​ కొట్టింది డివిలియర్సా లేక కోహ్లీనా? అని కామెంట్ చేసింది.

ఇదీ చదవండి:ఆ జాబితాలో రైనాను దాటి టాప్​లోకి ధవన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.