టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వదేశంలోనే కాకుండా విదేశీ క్రికెటర్లలోనూ అతడికి అభిమానులు ఉన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్. 2023లో ప్రపంచకప్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ధోని అప్పటికీ ఆడుతూ ఉంటే కచ్చితంగా నేనూ ఆడతాను’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2019లో వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉన్నా పరిస్థితులు అనుకూలించక వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని తెలిపాడు డివిలియర్స్. 2018 మే నెలలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్ వంటి విదేశీ లీగ్‌ల్లో మాత్రమే ఆడుతున్నాడు.
ఇది చదవండి: ప్రపంచకప్ ఆడేందుకు జాదవ్ సిద్ధం