ETV Bharat / sports

'మా బలహీనతల్ని టీమ్ఇండియా సొమ్ము చేసుకుంది' - మోర్గాన్ స్లో పిచ్​లు

రెండో టీ20లో తమపై టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించిందని తెలిపాడు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్. ఈ మ్యాచ్​లో తమ బలహీనతల్ని భారత జట్టు బయటపెట్టిందని వెల్లడించాడు.

Morgan
మోర్గాన్
author img

By

Published : Mar 16, 2021, 9:24 AM IST

రెండో టీ20లో టీమ్‌ఇండియా తమ బలహీనతలను బయట పెట్టిందని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. నెమ్మది పిచ్‌లపై ఇబ్బంది పడే తమ బలహీనతను కోహ్లీసేన సొమ్ము చేసుకుందని పేర్కొన్నాడు. కానీ ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు తమ ముందున్న ఏకైక దారి ఇదేనని వెల్లడించాడు. మ్యాచులో ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

"ప్రస్తుత పిచ్‌కు మా ఆటతీరుకు మధ్య వ్యత్యాసం ఉంది. తొలి మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌లో మంచి వేగం ఉంది. ఇప్పటి వికెట్‌ మందకొడిగా ఉంది. అది మా బలహీనతను బయటపెట్టింది. మేం ఎక్కువగా నెమ్మది పిచ్‌లపై ఆడలేడు. వాటిపై ఎంత ఎక్కువగా ఆడితే అంతగా మెరుగవుతాం. పొరపాట్లు చేస్తూ వీటిపై ఎక్కువగా ఆడితేనే నెమ్మది పరిస్థితులను అధిగమించగలం."

-మెర్గాన్‌, ఇంగ్లాండ్ సారథి

"తొలి మ్యాచ్‌ వికెట్‌ మాకు బాగా నప్పింది. ఎందుకంటే అందులో చక్కని వేగం ఉంది. ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్‌ పిచ్‌లా అనిపించింది. కానీ ఈ పిచ్‌ మాత్రం మమ్మల్ని సౌకర్యవంతమైన జోన్‌ నుంచి బయటపడేసింది. ఐపీఎల్‌లో ఆడే వికెట్‌లా అనిపించింది. ఏదేమైనా మేం మరింత కచ్చితత్వంతో ఆడాలి. వేగంగా నేర్చుకోవాలి. తొలుత మా ఇన్నింగ్స్‌ను అనుకున్నట్టే ఆరంభించాం. భాగస్వామ్యాలు నెలకొల్పాం. దూకుడు పెంచే క్రమంలో వివిధ దశల్లో వికెట్లు చేజార్చుకున్నాం. ఛేదనలో త్వరగా వికెట్‌ తీయడం తెలివైన పనే. కానీ టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంది. కోహ్లీ, కిషన్‌ దూకుడుగా ఆడి మాపై ఆధిపత్యం చెలాయించారు. వారిపై మా ప్రయత్నాలు వృథానే అయ్యాయి" అని మోర్గాన్‌ వెల్లడించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.