ETV Bharat / sports

'టెన్నిస్​ను కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నా' - yuvraj singh latest news udpates

క్రికెటర్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువరాజ్​ సింగ్.. ఒకప్పుడు టెన్నిస్​ను తన కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. ఇటీవలె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

I wanted to have a career in tennis: Yuvraj Singh
యువరాజ్​
author img

By

Published : Jul 27, 2020, 11:25 AM IST

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతడు అడుగుపెడుతున్నాడంటే చాలు.. క్రికెట్​ అభిమానుల అంచనాలు పెరిగిపోతాయి. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కన్న కలల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యువీ.

ఒకప్పుడు తాను టెన్నిస్​ ప్లేయర్​ కావాలని అనుకున్నట్లు తెలిపాడు. చిన్నప్పుడు తన తండ్రి కొనిచ్చిన టెన్నిస్​ రాకెట్​ను విరిచేసిన సంఘనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తనకు కొత్తది కొనివ్వమని అడిగేందుకు చాలా భయపడినట్లు పేర్కొన్నాడు యువరాజ్​.

"నాకు స్కేటింగ్​​, టెన్నిస్​ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో టెన్నిస్​ను నా కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నా. మా నాన్న నాకు ఓ రాకెట్​ కొనిచ్చాడు. ఆ సమయంలో దాని విలువ రూ.2,500. ఒకసారి క్వార్టర్​ ఫైనల్స్​లోనో, ఇంకేదో మ్యాచ్​లో ఆడుతూ చివరికి ఓడిపోయా. ఆవేశంలో రాకెట్​ను విరిచేశా. ఆ తర్వాత మా నాన్నను మళ్లీ కొత్తది కొనివ్వమని అడగడానికి భయమేసింది".

యువరాజ్​ సింగ్​, భారత మాజీ క్రికెటర్​

ఫిట్​నెస్​ను కాపాడుకునేందుకు ఇప్పటికీ కనీసం రెండ్రోజులకు ఒకసారి టెన్నిస్​ ఆడతానని చెప్పాడు యువరాజ్​. రిటైర్మెంట్​ తర్వాత కూడా క్రికెటర్లు, ఇతర ఆటగాళ్లు నిత్యం క్రీడల్లో పాల్గొనటానికి ఇష్టపడతారని అన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సచిన్​ తనతో మాట్లాడుతూ.. "నాలుగైదు రోజులకు మించి క్రికెట్​ ఆడకపోతే.. చాలా ఆందోళన చెందుతానని" చెప్పినట్లు యువరాజ్​ వివరించాడు.

యువరాజ్ సింగ్ తన కెరీర్​ మొత్తంలో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.