ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా కంగారూ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్ మెగాటోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో కేన్ రిచర్డ్సన్ను ఎంపికచేసింది ఆసిస్ సెలక్షన్ కమిటీ.
2015 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు కేన్. ఇప్పుడు జే రిచర్డ్సన్ గాయంతో దూరమవడం ఈ ఫాస్ట్ బౌలర్‌కు కలిసొచ్చింది.
"ప్రపంచకప్ జట్టుకు ఆడాలన్నది నా చిన్ననాటి కల. 2015 మెగాటోర్నీ అప్పుడు నా వయసు 24. ప్రస్తుతం 28. జట్టు తరఫున రాణించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు".
కేన్ రిచర్డ్ సన్, ఆస్ట్రేలియా క్రికెటర్
20 వన్డేలు ఆడిన కేన్ 29 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఇటీవల జరిగిన పాకిస్థాన్ సిరీస్‌లోనూ సత్తాచాటాడు.
ఇవీ చూడండి.. అదృష్టం కలిసొస్తే ప్రపంచకప్ మనదే...!