ETV Bharat / sports

'నాపై నిషేధం ఎందుకు విధించారో నాకే తెలియదు' - Azharuddin latest news

తనను నిషేధించడానికి గల కారణాలూ తనకే తెలియదని అంటున్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​​ అజారుద్దీన్​. 12 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నిర్దోషిగా తేలినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

I really don't know the reasons for banning me: Azharuddin
'నాపై నిషేధం ఎందుకు విధించారో నాకే తెలియదు'
author img

By

Published : Jul 30, 2020, 5:36 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​​ మహ్మద్​ అజారుద్దీన్​పై క్రికెట్​లో నిషేధం అనేక విధాలుగా పూర్తయింది. 2000లో మ్యాచ్​ ఫిక్సింగ్​లో పాల్గొన్న కారణంగా అజారుద్దీన్​పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జీవితకాలం పాటు నిషేధించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అజారుద్దీన్​.. ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. 2012లో దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు అజారుద్దీన్​.

"నాపై నిషేధం విధించడానికి గల కారణాలు నాకే తెలియవు. కానీ, దానిపై పోరాడాలని నిర్ణయించుకున్నా. 12 ఏళ్లపాటు పోరాడిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం దొరికినందుకు సంతోషం. హైదరాబాద్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నేను వెళ్లి బీసీసీఐ ఏజీఎం సమావేశానికి హాజరైనప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. పదేళ్ల పాటు టీమ్​ఇండియాకు కెప్టెన్​గా ఉండటం నా అదృష్టం"

-మహ్మద్​ అజారుద్దీన్​, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​

అజారుద్దీన్​.. కెరీర్​లో 99 టెస్టుల్లో 6,125 పరుగులు చేశాడు. 334 వన్డేల్లో 9,378 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్​ ఆరంభంలోనే వరుసగా మూడు సెంచరీలతో క్రికెట్​ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.