కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020 నిర్వాహణను వాయిదా వేసింది బీసీసీఐ. ముందస్తు ప్రణాళిక ప్రకారం మార్చి 29న చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో టోర్నీ ఏప్రిల్ 15కు వాయిదా పడింది.
ఒకవేళ ఐపీఎల్ రద్దుచేస్తే ధోనీ భవిష్యత్ ఏంటి అనేదానిపై స్పందించాడు భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే. ఐపీఎల్ రద్దయితే టీమిండియా తరపున ధోనీ ఆడే అవకాశం ఉండకపోచ్చని అంటున్నాడు.
"నా అంచనా ప్రకారం ధోనీ భారత జట్టులోకి రావాల్సిన అవాకాశాలన్ని ముగిసిపోయాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో స్థానం దక్కించుకుంటాడనేది సందేహమే. ఐపీఎల్లో ఉత్తమ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనేది తన లక్ష్యం."
-- హర్షభోగ్లే, భారత వ్యాఖ్యాత
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తననెందుకు తలైవా అని పిలుస్తారని అడిగినప్పుడు అతడిలోని మృదుస్వభావి కనిపించాడని అన్నాడు హర్షభోగ్లే. అంతటి ప్రేమాభిమానాలు పొందటం తన అదృష్టంగా భావించాడని అతడు వెల్లడించాడన్నాడు.
ఇదీ చూడండి.. ఆటగాళ్లను సింగర్స్‌గా మార్చిన కరోనా!