ETV Bharat / sports

ఆ దెబ్బకు కాఫీ తాగడం పూర్తిగా మానేసిన హార్దిక్ - coffee with karan show kl rahul hardik pandya

'కాఫీ విత్ కరణ్' టీవీ షోకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి తాను కాఫీ తాగడం పూర్తిగా మానేశానని చెప్పాడు హార్దిక్ పాండ్య. తాజాగా జరిగిన ఇన్​స్టా లైవ్​ చాట్​లో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

ఆ దెబ్బకు కాఫీ తాగడం పూర్తిగా మానేసిన హార్దిక్
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య
author img

By

Published : Apr 26, 2020, 2:01 PM IST

ఓ కప్పు కాఫీ తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య. అందుకే అప్పటి నుంచి కాఫీ బదులుగా గ్రీన్ టీ మాత్రమే తాగుతున్నానని అన్నాడు. భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్​తో ఇటీవలే జరిగిన ఇన్​స్టా లైవ్​చాట్​లో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

"కాఫీ విత్ కరణ్​' షోకు వెళ్లి వచ్చిన తర్వాత, కాఫీ తాగడం పూర్తిగా మానేశా. ఇప్పుడు గ్రీన్ టీ మాత్రమే తాగుతున్నా. నా జీవితంలో కాఫీ ఒక్కసారి తాగినందుకే భారీ మూల్యం చెల్లించుకున్నా. స్టార్​బక్స్ కంటే ఇదే ఖరీదైన కాఫీ అని నేను పందెం కూడా వేస్తా" -హార్దిక్ పాండ్య, భారత క్రికెటర్

గతంలో ఈ టీవీ షోకు, మరో క్రికెటర్​ కేఎల్ రాహుల్​తో కలిసి హాజరైన హార్దిక్.. మహిళలపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దూమారం రేపాయి. వీరిద్దరిని క్రికెట్ ఆడకుండా, కొన్నాళ్ల పాటు బీసీసీఐ నిషేధించింది.

ఈ విషయంతో పాటే ఐపీఎల్ గురించి మాట్లాడిన హార్దిక్.. ప్రేక్షకుల్లేకుండా టోర్నీ నిర్వహిస్తే, ఆడేందుకు తాను సిద్ధమని చెప్పాడు. ఒకవేళ ఇలానే జరిగితే అద్భుత ఆలోచన అవుతుందని అన్నాడు. ఇంట్లో ఉండైనా సరే ప్రజలు ఆనందం పొందుతారనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.