ETV Bharat / sports

'వాట్సాప్​లో మేం రోజూ చాటింగ్ చేసుకుంటాం'

author img

By

Published : Sep 2, 2020, 1:13 PM IST

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​​ షేన్​ వార్న్ తన కెరీర్​ను​ ప్రభావితం చేశాడని, అతడి బౌలింగ్ వీడియోలు చూసి, తన లోపాలు సరిచేసుకుంటానని అన్నాడు కుల్దీప్ యాదవ్.

Kuldeep Yadav
కుల్దీప్​ యాదవ్

తన క్రికెట్ కెరీర్​పై దిగ్గజ స్పిన్నర్​ షేన్​ వార్న్​ ప్రభావం చాలా ఉందని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. నాకు సందేహం వచ్చిన ప్రతిసారి, అతడి బౌలింగ్ వీడియోలు తప్పులు సరిదిద్దుకుంటానని తెలిపాడు. వాటి ద్వారా కొత్త కొత్త మెలకువలను నేర్చుకుంటుంటానని వెల్లడించాడు.

"2005 యాషెస్​ సిరీస్​లో వార్న్​​ బౌలింగ్​ ​చూసి బౌలర్ కావాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత పుణెలో భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​ సందర్భంగా అతడిని కలిశాను. ఆ సమయంలో స్పిన్ గురించి ఎన్నో మెలకువలు నేర్పాడు. మానసికంగా దృఢంగా తయారుచేశాడు. అలా మా ఇద్దరి మధ్య చక్కని బంధం ఏర్పడింది. ఇప్పటికీ రోజూ మేం వాట్సాప్​లో చాటింగ్ చేసుకుంటూ ఉంటాం"

-కుల్దీప్​ యాదవ్​, టీమ్​ఇండియా బౌలర్​

గత ఐపీఎల్​లో నామమాత్రంగానే రాణించిన కుల్దీప్.. ప్రస్తుత సీజన్​కు మాత్రం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్​లు జరగనున్నాయి. కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు కుల్దీప్.

ఇది చూడండి 'ఆ క్రెడిట్ అంతా కెప్టెన్​ మోర్గాన్​దే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.