కరోనా సంక్షోభం తర్వాత క్రికెట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ గెలిచింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లీష్ జట్టు తాత్కాలిక సారథి బెన్ స్టోక్స్.. వైఫల్యానికి ఎవరినీ తప్పుపట్టలేమని అన్నాడు.
ప్రతి క్రికెటర్ తమ శక్తి మేరకు బాగా ఆడారని స్టోక్స్ ప్రశంసించాడు. వారి విషయంలో గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఈ ఓటమి నుంచి ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకుంటామని అన్నాడు. లోపాలను సరిద్దిదుకుని రెండో టెస్టులో బరిలోకి దిగుతామని వెల్లడించాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో చెలరేగాలని సహచర జట్టు సభ్యులకు సూచించాడు.
కెప్టెన్ రూట్ రాక కోసం తాను ఎదురుచూస్తున్నట్లు స్టోక్స్ తెలిపాడు. అతడొస్తే నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు తనకు తప్పుతాయని అన్నాడు. ఈ మ్యాచ్‌కు సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జులై 16 నుంచి రెండో టెస్టు జరుగనుంది.
ఇది చూడండి : 'గంగూలీ గొడవ పెద్దది చేయొద్దన్నాడు'