ETV Bharat / sports

'ధోనీ, పాండ్య ప్రపంచకప్ జట్టులో ఉంటారు' - పాండ్య ప్రపంచకప్​లో ఉంటాడు హర్భజన్ సింగ్

ఐపీఎల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా హార్దిక్ పాండ్య, ధోనీలు టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదిస్తారని అంటున్నాడు టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్. జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్​గా ధోనీకి రికార్డుందని తెలిపాడు.

MS Dhoni
భజ్జీ
author img

By

Published : Apr 17, 2020, 6:41 PM IST

కరోనా వల్ల పలు క్రీడా టోర్నీలు రద్దవ్వగా మరికొన్ని వాయిదా పడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్​గా పేరొందిన ఐపీఎల్ కూడా నిరవధిక వాయిదా పడింది. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ధోనీతో సహా హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, దీపక్‌ చాహర్‌ లాంటి ఆటగాళ్లు చాలా కాలంగా ఆటకు దూరమయ్యారు. దీంతో వీళ్లంతా ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేయాలి. అయితే దీంతో సంబంధం లేకుండా ధోనీ, పాండ్య ప్రపంచకప్​ జట్టులో ఉంటారని హర్భజన్ సింగ్ అంటున్నాడు.

"ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌తో సంబంధం లేకుండా ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడు అందులో ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే పేపర్‌ మీద రాసిస్తా. టీమ్‌ఇండియాలో సరైన కూర్పు కావాలంటే పాండ్య కచ్చితంగా జట్టులో ఉండాలి. గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమైనా అతడు తుది జట్టులో ఉంటాడు. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా అతడిని ఎంపిక చేయొద్దు."

-హర్భజన్ సింగ్, టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్

ధోనీ గురించి కూడా హర్భజన్ స్పందించాడు. టీమ్​ఇండియాకు ప్రపంచకప్​ అందించిన కెప్టెన్​గా దోనీకి రికార్డుందని తెలిపాడు. అతడి అనుభవం టీ20 ప్రపంచకప్​న​కు పనిచేస్తుందని అన్నాడు.

"ధోనీని ఎలా జడ్జ్ చేస్తారు. ఐపీఎల్​లో ఫామ్​ చూసి అతడిని జట్టులోకి తీసుకుంటారా? లేక భారత్​కు అత్యుత్తమ క్రికెటర్​గా, కెప్టెన్​గా అతడికి గౌరవం ఇస్తారా? టీమ్​ఇండియాకు మహీ ఎంతో సేవ చేశాడు. అతడు అందుబాటులో ఉంటే జట్టులోకి తీసుకోవాలి."

పాండ్య గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడాడు. తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన డీవై పాటిల్‌ టీ20 క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసి సత్తా చాటాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీస్ తర్వాత నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు ధోనీ. ఐపీఎల్​లో బరిలోకి దిగాలనుకున్నా కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.