భారత్- బంగ్లాదేశ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా డేనైట్ టెస్టు జరుగుతోంది. ఇరుజట్లు గులాబి బంతితో ఆడటం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ బృందం డేనైట్ టెస్టు ఆడతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
"డేనైట్ టెస్టు ఆడేందుకు అంగీకారం తెలిపినందుకు గంగూలీ, కోహ్లీలకు అభినందనలు. వచ్చే వేసవిలో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినపుడు అడిలైడ్ వేదికగా గులాబి బంతితో ఆడతారని అనుకుంటున్నా."
-షేన్ వార్న్, ఆసీస్ మాజీ ఆటగాడు
ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలకు అభినందనలు తెలిపాడు మాజీ క్రికెటర్ వార్న్. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా గంగూలీకి అభినందనలు తెలియజేశాడు.
టీమిండియా జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్ కేటాయిస్తే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో పింక్ బంతితో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.
ఇది చదవండి: పింక్ టెస్టు: తొలిరోజు కోహ్లీసేనదే.. ఆధిక్యంలో భారత్