టీమిండియా, సఫారీ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు ముప్పుగా మారాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జోరుగా వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటలలోపు వాన ఆగుతుందని అధికారులు భావిస్తున్నారు. హెచ్పీసీఏ(హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్)స్టేడియంలో మెరుగైన డ్రైనేజ్ సదుపాయాలు ఉన్నాయి. వాన తెరిపినిస్తే మ్యాచ్ కోసం మైదానాన్ని వెంటనే సిద్ధం చేయగలమని క్యురేటర్ చెప్పారు. ఆట రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. చివరి అవకాశంగా జట్టుకు ఐదు ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను ఆడించే వీలుంది.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డికాక్ (సారథి), డసెన్ (ఉప సారథి), తంబే బవుమా, జూనియర్ డాలా, ఫార్చ్యూన్, బ్యూరెన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ఆన్రిచ్ నోర్టజే, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, రబాడ, తబ్రేజ్ షంశీ, జార్డ్ లిండే
ఇదీ చదవండి...