ETV Bharat / sports

హిట్టింగ్ సరే.. మరి ఫిట్​నెస్ సంగతేంటి..! - హిట్టింగ్ సరే.. మరి ఫిట్​నెస్ సంగతేంటి..!

న్యూజిలాండ్​తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రనౌట్​గా వెనుదిరిగాడు. ఈ విషయంపై స్పందించిన వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా.. ఫిట్​నెస్​పై దృష్టిసారించాలంటూ సూచించాడు.

ఆకాశ్
ఆకాశ్
author img

By

Published : Feb 12, 2020, 6:41 AM IST

Updated : Mar 1, 2020, 1:17 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​ను 0-3 తేడాతో కోల్పోయింది టీమిండియా. ఈ సిరీస్​లో ఓపెనర్లుగా అరంగేట్రం చేసిన పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ తమ ప్రతిభ చూపెట్టుకోలేకపోయారు. పృథ్వీ మోస్తారుగా రాణించినా భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యాడు.

చివరిదైన మూడో వన్డేలో పృథ్వీ 42 బంతుల్లో 40 పరుగులు చేసి మంచి ఫామ్​లో కనిపించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. కానీ అదే సమయంలో రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్​గా వెనుదిరిగాడు. దీనిపై వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. అక్కడ సులువుగా రెండో పరుగు వస్తుందని కానీ షా ఫిట్​నెస్ అందుకు తగ్గట్టుగా లేదని కామెంట్ చేశాడు.

"అక్కడ రెండో పరుగు సులువుగా వస్తుంది. ఆ పరుగు కోసం పృథ్వీనే ప్రయత్నించాడు. కానీ రనౌట్​గా వెనుదిరగడం ఆశ్చర్యంగా అనిపించింది. బంతిని బాదే ప్రత్యేకమైన ప్రతిభ షా సొంతం. కానీ ఫిట్​నెస్​పై మరింత శ్రద్ధ పెట్టాలి."

-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత

ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​ కోసం పృథ్వీ రెండో ఓపెనర్​ బరిలో ఉన్నాడు. ఇతడితో పాటు శుభమన్​ గిల్​ కూడా పోటీపడుతున్నాడు. మరి షాకు ఈ సిరీస్​లో అవకాశం వస్తుందో లేదో చూడాలి.

Last Updated : Mar 1, 2020, 1:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.