క్రికెట్లో ప్రత్యర్థి క్రికెటర్ల ఆట నచ్చడం.. వారి వ్యక్తిత్వాన్ని అభిమానించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్‌కు మాత్రం ప్రత్యర్థి ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ సెంటు నచ్చింది. అతడి అత్తరు వాసన బాగుందని మ్యాచ్ మధ్యలోనే పైన్ పొగిడాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో వికెట్ల వెనక ఉన్న టిమ్‌పైన్.. సెంటు బాగుందని రిజ్వాన్‌తో అన్నాడు. స్టంప్ మైక్ ద్వారా ఈ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్లో షేర్ చేసింది.
-
"He smells very nice."
— cricket.com.au (@cricketcomau) November 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Tim Paine was impressed with Muhammad Rizwan's scent upon his arrival at the crease 😅#AUSvPAK pic.twitter.com/DMHYDEm2Pl
">"He smells very nice."
— cricket.com.au (@cricketcomau) November 21, 2019
Tim Paine was impressed with Muhammad Rizwan's scent upon his arrival at the crease 😅#AUSvPAK pic.twitter.com/DMHYDEm2Pl"He smells very nice."
— cricket.com.au (@cricketcomau) November 21, 2019
Tim Paine was impressed with Muhammad Rizwan's scent upon his arrival at the crease 😅#AUSvPAK pic.twitter.com/DMHYDEm2Pl
గబ్బా వేదికగా ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. అసద్ షఫీక్(76) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కంగారూ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశారు.
ఇదీ చదవండి: కొరియా మాస్టర్స్‌లో ముగిసిన భారత్ పోరు.. సమీర్ ఔట్