ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముంబయి గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు సూర్యకుమార్ యాదవ్. ఈ నేపథ్యంలో అతడిని ప్రశంసించాడు సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్. సూర్యకుమార్‌ను భారత డివిలియర్స్ అని అభివర్ణించాడు. ఆసీస్ పర్యటనలో సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.
"ముంబయి ఇండియన్స్ తరఫున బ్యాటింగ్‌లో సూర్య కుమార్ చాలా బాధ్యత తీసుకున్నాడు. మొదటి బంతి నుంచే మంచి స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. అన్ని రకాల షాట్లను చక్కగా ఆడగలడు. ఎలాంటి బౌలింగ్‌నైనా సరే ఎదుర్కోగలడు. అతడు భారతీయ ఏబీ డివిలియర్స్. టీమ్ఇండియాలోకి సూర్యకుమార్‌ను ఎంపిక చేయాల్సిందని భావిస్తాను"
-- హర్భజన్ సింగ్, టీమ్ఇండియా సీనియర్ క్రికెట్
ఈ సీజన్లో 16 మ్యాచ్‌లాడి 480 పరుగులు చేశాడు సూర్యకుమార్. 2018లో 512 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2019లో 424 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గౌతమ్ గంభీర్, ఇయాన్ బిషప్, టామ్ మూడీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల ప్రశంసల్ని అందుకున్నాడు.
ఇవీ చదవండి: