ETV Bharat / sports

యువీపై కేసు: హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - హరియాణా హైకోర్టు

తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను కొట్టేయాలని కోరుతూ పంజాబ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్​. ఈ వ్యవహారంలో తమ స్పందన తెలియజేయాలని హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

HC issues notice to Haryana govt on Yuvraj Singh's petition
యువీపై కేసు: హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
author img

By

Published : Feb 26, 2021, 11:52 AM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాజ్యంపై స్పందించాలని హరియాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది పంజాబ్, హరియాణా హైకోర్టు. తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ కోర్టులో యువీ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై తమ స్పందన తెలియజేయాలని ఫిర్యాదు దారు సహా సర్కారు, పిటిషనర్ తరఫు న్యాయవాదికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.

యువరాజ్​పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో స్పందించాలని సంబంధిత వర్గాలకు చెప్పింది.

గతేడాది ఏప్రిల్​లో లాక్​డౌన్​లో జీవితం ఎలా ఉందనే అంశంపై క్రికెటర్ రోహిత్​ శర్మతో కలిసి ఇన్​స్టాగ్రామ్​లో సరదాగా ముచ్చటించాడు యువీ. ఆ సమయంలో మరో ఇద్దరు క్రికెటర్ల గురించి స్నేహపూర్వకంగా వ్యాఖ్యనించాడని, ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం యువీకి లేదని అతడి తరఫు న్యాయవాది తెలిపారు. ఇదే వ్యవహారంలో యువీపై గతవారం ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

ఇదీ చూడండి: మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.