పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించింది పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ). ఈ ఆటగాడి రిటైర్మెంట్పైనా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ విషయంపై సర్ఫరాజ్ భార్య ఖుష్బత్ స్పందించింది.
"సర్ఫరాజ్ ఇప్పుడే ఎందుకు రిటైర్ అవ్వాలి. అతడి వయసు 32 ఏళ్లు. ధోనీ వయసెంత..? 32 సంవత్సరాలపుడు ధోనీ వీడ్కోలు పలికాడా...? త్వరలోనే నా భర్త తిరిగి జట్టులోకి వస్తాడు. అతడో పోరాటయోధుడు. కెప్టెన్‌గా తొలిగించినంత మాత్రాన కెరీర్ ముగిసిపోలేదు. ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఆడతాడు."
-ఖుష్బత్, సర్ఫరాజ్ భార్య
సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని ఆహ్వానిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇవీ చూడండి.. విజయానికి చేరువలో భారత్.. కష్టాల్లో సఫారీలు