ETV Bharat / sports

నటాషాతో 'డిన్నర్​ డేట్'కు హార్దిక్​ పాండ్యా​ - hardik pandya in australia tour

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి.. నాలుగు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్నాడు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చిన అతడు.. తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా భార్య నటాషా స్టాంకోవిచ్​ను డిన్నర్​ కోసం బయటకు తీసుకువెళ్లాడు.

hardik pandya spending quality time with her partner natasha stankovic
నటాషాను 'డిన్నర్​ డేట్'కు తీసుకువెళ్లిన హార్దిక్​ పాండ్యా​
author img

By

Published : Dec 17, 2020, 12:15 PM IST

చాలా రోజుల విరామం తర్వాత టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యా తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఐపీఎల్​, ఆస్ట్రేలియా పర్యటన కోసం విదేశాలకు వెళ్లిన ఈ ఆటగాడు.. ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో తన భార్య నటాషా స్టాంకోవిచ్‌, కుమారుడు అగస్త్యతో కలిసి హాయిగా సమయాన్ని గడుపుతున్నాడు. నటాషాను ఈ మధ్యే డిన్నర్​కు తీసుకువెళ్లాడు హార్దిక్​. ఆ ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో 'మై డిన్నర్​ డేట్'​ అంటూ పంచుకుంది నటాషా. ఆ తర్వాత.. ​ తన ఖాతాలోనూ వాటిని షేర్​ చేశాడు హార్దిక్​.

హార్దిక్​ పాండ్యా జులైలో తండ్రిగా మారాడు. ఐపీఎల్​ కోసం యూఏఈ వెళ్లిన అతడు.. నాలుగు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ తరఫున ఆడి.. ఆ జట్టు టైటిల్​ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన హార్దిక్​.. మూడు వన్డేలు, పలు టీ-20ల్లో పాల్గొన్నాడు. వన్డేల్లో 2-1 తో భారత్​ ఓడిపోయినప్పటికీ హార్దిక్​ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మూడు ఇన్నింగ్స్​లో కలిపి 210 పరుగులు సాధించి, టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

ఇదీ చూడండి:ఆ ఇన్నింగ్స్​ నాకెంతో ప్రత్యేకం: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.