ETV Bharat / sports

'గాన గంధర్వులు'గా మారిన పాండ్యా సోదరులు - తేరి మిట్టీ పాట పాడిన పాండ్యా బ్రదర్స్​

సోషల్​ మీడియాలో పాండ్యా బ్రదర్స్ ప్రస్తుతం హాట్​ టాపిక్​గా నిలిచారు. ఈ అన్నదమ్ములిద్దరూ తాజాగా అక్షయ్​ కుమార్​ హీరోగా నటించిన 'కేసరి' సినిమాలోని 'తెరి మిట్టీ' పాటను పాడి వీక్షకులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. ​

Hardik Pandya sings Bollywood song 'Teri Mitti' with Krunal, video goes viral
'గాన గంధర్వులు'గా మారిన పాండ్యా సోదరులు
author img

By

Published : May 18, 2020, 1:17 PM IST

టీమ్​ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య​ ఓ పాట పాడి సామాజిక మాధ్యమాల్లో హాట్​ టాపిక్​గా మారారు. బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్ హీరోగా నటించిన 'కేసరి' సినిమాలోని 'తెరి మిట్టీ' పాటను పాడి అలరించారు. ఈ వీడియోను హార్దిక్​ తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేయగా.. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.

లాక్​డౌన్​లో కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్న హార్దిక్​, కృనాల్​ పాండ్యా.. వారికి నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. తాజాగా ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి 'తెరి మిట్టీ'ని ఆలపించడం నెటిజన్లను ఆకర్షించింది.

అలా అయినా ప్రేక్షకులు ఆస్వాదిస్తారు

ఖాళీ మైదానాల్లో ఐపీఎల్​ నిర్వహించాలనే ఆలోచనపై టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా స్పందించాడు. "ప్రేక్షకులు లేకుండానే రంజీట్రోఫీ ఆడాను. వీక్షకులు ఉండటానికి, లేకపోవడానికి వ్యత్యాసం గమనించాను. స్టేడియం తలుపులు మూసేసి ఐపీఎల్​ నిర్వహించినా.. కనీసం అభిమానులు ఇంట్లో ఉండైనా ఆ అనుభూతి పొందుతారు" అని దినేశ్​ కార్తిక్​, కృనాల్​ కలిసి పాల్గొన్న ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో హార్దిక్​ వెల్లడించాడు.

ఇదీ చూడండి.. 'నేను ఫిట్​గా తయారవ్వడానికి కారణం అతడే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.