టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక పాండ్య త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా గర్భవతిగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు.
"మా ఇద్దరి జీవిత ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. త్వరలోనే మా జీవితంలోకి మరొకరిని ఆహ్వానించబోతున్నాం. ఈ విషయం మాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు కోరుతున్నాను."
-హార్దిక పాండ్య, టీమ్ ఇండియా ఆల్ రౌండర్.
మరోవైపు వీరిద్దరూ కలిసి సంప్రదాయ దుస్తుల్లో కూర్చొని ఏదో పూజ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు హార్దిక్. 2020 న్యూ ఇయర్ రోజున వీరిద్దరు నిశితార్థం చేసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ముంబయి ఇండియన్స్ తరఫున అడుతున్నాడు హార్దిక్. లాక్డౌన్ నేపథ్యంలో ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ.
ఇదీ చూడండి : చివరి వరకు ఆమెతో బంధం కొనసాగిస్తా : ద్యుతీ చంద్