ETV Bharat / sports

'భజ్జీ చేరికతో మా స్పిన్ విభాగం బలోపేతం' - ఇయాన్ మోర్గాన్

కోల్​కతా జట్టులో హర్భజన్ సింగ్​​ చేరడం వల్ల తమ స్పిన్ విభాగం బలోపేతమవుతుందని వెల్లడించాడు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ప్రస్తుత సీజన్​లో తమ టీమ్​లో అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారని తెలిపాడు.

Harbhajan will bolster our spin department: Morgan
'భజ్జీ చేరికతో మా స్పిన్ విభాగం బలోపేతమవుతుంది'
author img

By

Published : Mar 31, 2021, 10:24 PM IST

హర్భజన్ తమ జట్టుతో చేరడం వల్ల స్పిన్ విభాగం బలోపేతమవుతుందని తెలిపాడు కోల్​కతా నైట్ రైడర్స్​ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. అన్ని ఫ్రాంఛైజీల్లో కెల్లా తమ టీమ్​లోనే అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారని వెల్లడించాడు. 'మేము చెన్నైలో ఆడనున్నాం. అక్కడ పిచ్ స్పిన్​కు అనుకూలంగా ఉంటుంది. మా స్పిన్నర్లు బాగా బౌలింగ్​ చేస్తే.. మేము టోర్నీలో ముందంజలో ఉన్నట్లే' అని మోర్గాన్ పేర్కొన్నాడు.

చెన్నై మొత్తం మూడు సార్లు ట్రోఫీ సాధించగా.. అందులో రెండు సార్లు సీఎస్కే తరఫున ఆడిన అనుభవం భజ్జీ సొంతం. అలాంటిది ప్రస్తుత సీజన్​ తొలి రౌండ్ వేలంలో భజ్జీని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. రెండో రౌండ్​లో బేస్​ ప్రైజ్​కు దక్కించుకుంది కోల్​కతా జట్టు.

భారత్​తో వన్డే సిరీస్​కు, ఐపీఎల్​కు మధ్య తగినంత ఖాళీ సమయం ఉండడం తనకు కలిసొచ్చిందని తెలిపాడు మోర్గాన్. గాయం నుంచి కోలుకోవడానికి ఈ సమయం ఉపయోగపడిందని పేర్కొన్నాడు.

మోర్గాన్ బొటన వేలుకు, చూపుడు వేలుకు మధ్య చీలిక వచ్చింది. దీంతో, టీమ్​ఇండియాతో చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు.

ఇటీవల ఇంగ్లాండ్​పై అరంగేట్రం చేసిన యువ బౌలర్​ ప్రసిధ్ కృష్ణ.. మోర్గాన్​ కెప్టెన్సీలోనే ఐపీఎల్​లో​ ఆడనున్నాడు. 'ఆరోజు మ్యాచ్​ టాస్​ వేయగానే ప్రసిధ్​ దగ్గరికి వెళ్లి అభినందించా. అరంగేట్ర అంటే కేవలం ప్రారంభ మ్యాచ్​ మాత్రమే కాదు. అది వారి కుటుంబానికి, సన్నిహితులకు, మిత్రులకు, ఆ ఆటగాడికి ప్రత్యేక సందర్భం' అని మోర్గాన్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్ 2021: చెన్నై చేరుకున్న రోహిత్ సేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.