ETV Bharat / sports

సినిమా కోసం భజ్జీ స్టెప్పులు.. ఫొటోలు వైరల్​ - bhajji dance photos

తమిళ సినిమాలో నటిస్తున్న హర్భజన్ సింగ్​ స్టెప్పులతో అదరగొట్టాడు. 'ఫ్రెండ్‌షిప్‌' పేరిట రూపుదిద్దుకొంటున్న ఆ సినిమా చివరి షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఓ పాట చిత్రీకరణలో భాగంగా తీసిన ఫొటోలను టీమ్‌ఇండియా క్రికెటర్‌ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు. అవి వైరల్​గా మారాయి.

harbhajan-singh-shares-his-debut-movie-still-on-social-media-very-eager-to-meet-the-fans-in-theatres
సినిమా కోసం భజ్జీ స్టెప్పులు.. ఫొటోలు వైరల్​
author img

By

Published : Feb 16, 2021, 4:45 PM IST

టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ త్వరలో సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం భజ్జీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటంలేదు. ఈ క్రమంలోనే ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. 'ఫ్రెండ్‌షిప్‌' పేరిట రూపుదిద్దుకొంటున్న ఆ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఓ పాట చిత్రీకరణలో భాగంగా తీసిన ఫొటోలను టీమ్‌ఇండియా క్రికెటర్‌ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ వేసవిలో థియేటర్లలో సందడి చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఆ ఫొటోల్లో భజ్జీ డాన్స్‌ చేస్తూ కనిపించాడు. కళ్లోజోడు, తెల్ల బూట్లతో లుంగీ పైకి చుట్టి స్టెప్పులేస్తున్నాడు. కాగా, ఈ సినిమా గతేడాదిలోనే పూర్తి కావాల్సి ఉన్నా..లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. తాజాగా చివరి షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నట్లు భజ్జీ పేర్కొన్నాడు. ఈ వేసవిలో విడుదలవుతుందని చెప్పాడు. మరోవైపు హర్భజన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో ఆడలేకపోయాడు. ఇక త్వరలో జరిగే మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన 292 మంది(వేలంలో పాల్గొనే ఆటగాళ్లు) జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీంతో గురువారం అతడిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచిచూడాలి.

ఇదీ చూడండి: టెస్టు విజయాల్లో ధోనీ సరసన విరాట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.