ETV Bharat / sports

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి భజ్జీ​ చిట్కా..​! - రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి హర్భజన్​ సూచనలు

కరోనా వైరస్​ బారి నుంచి బయట పడటానికి తగిన వ్యాక్సిన్​ లేని కారణంగా మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే 20 సెకన్ల పాటు కొన్ని విచిత్రమైన స్టంట్లు చేస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని అంటున్నాడు భారత క్రికెటర్​ హర్భజన్​సింగ్​. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్​ చేస్తున్నారు.

Harbhajan Singh shares a video of to Keep you Fit and Boost Your Immunity
ఇలా రోగనిరోధక శక్తి పెంచుకోండి: హర్భజన్​
author img

By

Published : Jun 20, 2020, 8:30 PM IST

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. ఇప్పటికే సుమారు 89లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. 4లక్షలకుపైగా మంది మరణించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే ఎవరికి వారు తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ శనివారం ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో.. 20 సెకన్ల పాటు వ్యాయామం చేసి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలనే విషయాన్ని తెలియజేశాడు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎవరికీ సాధ్యంకాని రీతిలో విచిత్రమైన స్టంట్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. భజ్జీ పంచుకున్న ఆ వీడియోలోని ఫీట్‌ చేయడం ఎవరికైనా కష్టతరమే. ఈ వీడియో చూసిన నెటిజన్లు భజ్జీని ఆటపట్టిస్తున్నారు. "మొదట నువ్వు డెమో చేసి చూపించు," అని అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, ఎవరూ ప్రయత్నించవద్దని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

విదేశీ లీగుల్లో ఆడటానికి అనుమతి

హర్భజన్‌ ఇటీవలే మాజీ క్రికెటర్ ఆకాశ్‌చోప్రాతో మాట్లాడుతూ బీసీసీఐకి ఓ విన్నపం చేశాడు. నాన్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లకు విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం కల్పించాలని కోరాడు. ఈ ప్రతిపాదనకు సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌ లాంటి ఆటగాళ్ల నుంచి మద్దతు లభించింది.

ఇదీ చూడండి... 24 గంటల లైవ్​ వర్కౌట్​లో షట్లర్ పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.