ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హడిన్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ జట్టు యాజమాన్యం ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
"ఆసీస్ మాజీ వైస్ కెప్టెన్ బ్రాడ్ హడిన్‌ను సన్‌రైజర్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించాం. 2015 ప్రపంచకప్ విజేతైన ఆసీస్ జట్టులో హడిన్ సభ్యుడు" -సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్
ఇంతకుముందు కోచ్‌గా టామ్ మూడీ స్థానంలో ఇంగ్లాండ్ మాజీ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను గత నెలలో నియమించింది సన్‌రైజర్స్ జట్టు.
-
Mentors, Coaches and Support Staff of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/r7E0Rvm83x
— SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mentors, Coaches and Support Staff of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/r7E0Rvm83x
— SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019Mentors, Coaches and Support Staff of SunRisers Hyderabad.#OrangeArmy #RiseWithUs pic.twitter.com/r7E0Rvm83x
— SunRisers Hyderabad (@SunRisers) August 19, 2019
ట్రెవర్, బ్రాడ్ హడిన్కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఇద్దరూ వేరువేరుగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో పనిచేశారు. ఇప్పటికే సన్‌రైజర్స్ జట్టులో మెంటర్లుగా వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీ ధరన్ సేవలందిస్తున్నారు.
ఐపీఎల్లో గత నాలుగు సీజన్లలోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది సన్‌రైజర్స్. 2016లో టైటిల్ నెగ్గగా.. 2018లో రన్నరప్‌గా నిలిచింది.
ఇవీ చూడండి.. విలియమ్సన్, ధనంజయల బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు