ETV Bharat / sports

'రస్సెల్​పై ఆధారపడటం వల్లే కోల్​కతాకు వైఫల్యం!' - కోల్​కతా నైట్​రైడర్స్​ వైఫల్యంపై కెప్టెన్​ దినేశ్​ కార్తిక్​ స్పందన

2019 ఐపీఎల్​లో కోల్​కతా జట్టు వైఫల్యంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు ఆ జట్టు కెప్టెన్​ దినేశ్​ కార్తీక్​. ఆ సీజన్​లో ఆల్​రౌండర్​ ఆండ్రూ రస్సెల్​పై ఎక్కువగా ఆధారపడటం సహా పేలవ ప్రదర్శన కూడా జట్టును చివరి వరకు వెంటాడిందని వెల్లడించాడు.

Had a conversation over it man to man': KKR skipper Dinesh Karthik talks about dispute he had with Andre Russell
'రస్సెల్​పై ఆధారపడటం వల్లనే కోల్​కతాకు వైఫల్యం!'
author img

By

Published : Jul 29, 2020, 6:09 AM IST

గతేడాది ఐపీఎల్​ సీజన్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ వైఫల్యానికి కారణం ఆల్​రౌండర్​ ఆండ్రూ రస్సెల్​పై ఎక్కువగా ఆధారపడటమే అని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్​ దినేశ్​ కార్తీక్​. దాంతో పాటు పేలవమైన ప్రదర్శన కూడా వెంటాడిందని తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఐపీఎల్​లో విజయవంతం కాకపోవడంపై రస్సెల్​ గతంలోనే స్పందించాడు. జట్టు ఓటమికి కారణం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే అని అన్నాడు. ఈ మాటలు కార్తీక్​, రస్సెల్​ మధ్య విభేదాలు తెచ్చిపెట్టాయి. ఈ సమస్యపై రస్సెల్​తో చర్చించినట్లు తాజాగా వెల్లడించాడు కార్తీక్​.

"నిజం చెప్పాలంటే వెస్టిండీస్​ ఆటగాళ్లు కల్మషం లేనివారు. నేను చెప్పిన దాన్ని రస్సెల్​ అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. వారు ఏమి చెప్పినా నిజాయితీగా చెబుతారు. అది ఎదుటివారు వాటిని ఎలా అర్థం చేసుకుంటారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దాన్ని తప్పుగా తీసుకుంటే ఆ పొరపాటు మీదే అవుతుంది. రస్సెల్​ జట్టు గెలవలేదనే కారణాల వల్ల సంతోషంగా లేడు. ఆ విషయం అతను చెప్పగా.. నేను దాన్ని గౌరవించా. ఆ తర్వాత క్షమాపణ చెప్పాడు. అదే రోజున నేను అతడితో మంచిగా వ్యవహరించకపోతే అది నా మూర్ఖత్వం అవుతుంది".

-దినేశ్​ కార్తీక్​, కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్

"నేను అతనితో నిజాయితీగా వ్యవహరించా. అప్పుడే నేరుగా రస్సెల్​ దగ్గరకు వెళ్లి.. 'రస్​ నీకేమి తెలుసు. నువ్వు చెప్పింది సరైంది అని నేను అనుకోను. ఎందుకంటే నువ్వు చెప్పిన విధానం మంచిది కాదు' అని అన్నా. దానికి అతను స్పందిస్తూ.. 'నేను ఎలా భావించానో అలానే బయటకు చెప్పా' అని అతడు వెల్లడించాడు. అప్పుడే ఆ వివాదం సద్దుమణిగింది. నాయకుడిగా తనను సంతోషపెట్టలేకపోవచ్చు. కానీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చగలిగినా.. అవి కచ్చితంగా మారవు." అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.