ETV Bharat / sports

'కోహ్లీ-రోహిత్​లను అసలు స్లెడ్జింగ్ చేయలేను' - kohli rohit Saifuddin

తన ఆరాధ్య క్రికెటర్లయిన కోహ్లీ, రోహిత్​ శర్మలకు.. ప్రపంచకప్​ ప్రాక్టీసు సందర్భంగా బౌలింగ్ చేయడం చాలా సంతోషమం అనిపించిందని బంగ్లా బౌలర్ సైఫుద్దీన్ తెలిపాడు. అయితే వారిని స్లెడ్జింగ్​ చేయాలన్న ఆలోచన అస్సలు లేదని స్పష్టం చేశాడు.

'కోహ్లీ-రోహిత్​లను అసలు స్లెడ్జింగ్ చేయలేను'
కోహ్లీ-రోహిత్​
author img

By

Published : Aug 12, 2020, 10:33 AM IST

దాదాపు 10-12 ఏళ్ల నుంచి కోహ్లీ-రోహిత్​ల ఆట చూస్తూ పెరిగానని, అలాంటిది ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్​​ సందర్భంగా వారికి బౌలింగ్ చేసే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పాడు బంగ్లాదేశ్ పేసర్ మహ్మద్ సెఫుద్దీన్. గతేడాది జరిగిన ఆ విశేషాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

"గతేడాది ప్రపంచకప్​లో భాగంగా కార్డిఫ్​లో భారత్​తో ప్రాక్టీసు మ్యాచ్ ఆడాం. నేను బౌలింగ్ చేసేటప్పటికి రోహిత్ బ్యాటింగ్, కోహ్లీ​ నాన్ స్ట్రైకింగ్​ ఎండ్​లో ఉన్నాడు. 'దాదాపు 10-12 ఏళ్ల నుంచి మీ ఆట చూస్తూ పెరిగాను. మీరు నా ఆరాధ్య క్రికెటర్లు. ఇప్పుడు మీకు బౌలింగ్ చేస్తున్నాను. ఏమవుతుందో చూడాలి' అని రోహిత్​తో చెప్పాను. దానికి నవ్విన అతడు.. గుడ్​లక్ చెప్పాడు. వారిద్దరిలో కనీసం ఒకరినైనా ఔట్ చేయాలనుకున్నాను. అనుకున్నట్లే ఆరోజు కోహ్లీ వికెట్ తీశాను"

-మహ్మద్ సైఫుద్దీన్, బంగ్లా పేసర్

rohit sharma with kohli
కోహ్లీతో రోహిత్ శర్మ

ఈ మ్యాచ్​లో తొలుత భారత్ 359 పరుగులు చేయగా, చాహల్-కుల్దీప్ స్పిన్​ మాయతో బంగ్లాదేశ్ 264 పరుగులకే ఆలౌట్​ అయి ఓడిపోయింది.

కోహ్లీ-రోహిత్​లను చూస్తూ పెరిగిన తనకు, వారిని స్లెడ్జింగ్​ చేయాలనే ఆలోచనే లేదని సైఫుద్దీన్ స్పష్టం చేశాడు. క్రికెట్ జెంటిల్మన్ గేమ్ అని, అది అలానే ఉండాలని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.