ETV Bharat / sports

క్రీడా బడ్జెట్​: గతేడాదితో పోలిస్తే రూ.230 కోట్లు కోత

2021-22 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా క్రీడలకు సంబంధించి గతేడాదితో పోలిస్తే రూ.230.78కోట్లు తగ్గించి రూ.2,596.14 కోట్లు కేటాయించారు.

budjet
బడ్జెట్​
author img

By

Published : Feb 1, 2021, 7:14 PM IST

Updated : Feb 1, 2021, 9:10 PM IST

లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ క్రీడలకు చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకుండానే సాగింది. 2021-22 ఏడాదికిగానూ క్రీడల కోసం రూ.2,596.14 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోల్చుకుంటే రూ.230.78కోట్లు(8.16శాతం) తక్కువగా కేటాయించారు.

స్పోర్ట్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా(శాయ్​)కు గతేడాది కన్నా రూ.160కోట్లు పెంచి రూ.660.41కోట్లు కేటాయించారు. అయితే ఖేలో ఇండియాకు మాత్రం 232.71కోట్లు తగ్గించి రూ.657.71కోట్లతో సరిపెట్టారు. నేషనల్​ స్పోర్ట్​ ఫెడరేషన్స్​కు గతేడాదితో పోలిస్తే రూ.35కోట్లు పెంచి రూ.280కోట్లు కేటాయించగా.. కామన్​ వెల్త్​ గేమ్స్​కు రూ.33కోట్లు తగ్గించి రూ.30కోట్లు కేటాయించారు.

Last Updated : Feb 1, 2021, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.