ETV Bharat / sports

క్రికెటర్ మ్యాక్స్​వెల్​కు నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి - cricket news

ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్​వెల్​కు, భారత సంతతి యువతి వినీ రామన్​తో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరి పెళ్లి జరగనుంది.

క్రికెటర్ మ్యాక్స్​వెల్​కు నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి
క్రికెటర్ మ్యాక్స్​వెల్
author img

By

Published : Feb 26, 2020, 10:18 PM IST

Updated : Mar 2, 2020, 4:44 PM IST

మరో క్రికెటర్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్.. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ యువతి వినీ రామన్​ను త్వరలో వివాహం చేసుకోనున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోను ఈరోజు(బుధవారం) ఇన్​స్టాలో పంచుకున్నాడు. పలువురు ఆటగాళ్లు.. సోషల్ మీడియా వేదికగా వీరిని అభినందిస్తున్నారు.

Glenn Maxwell vini raman
వినీ రామన్​తో క్రికెటర్ మ్యాక్స్​వెల్

వినీ-మ్యాక్స్​వెల్.. గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇటీవలే ఒత్తిడి కారణంగా జట్టు నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నాడు మ్యాక్సీ. ఆ తర్వాత బిగ్​బాష్​ లీగ్​లో పాల్గొన్నాడు. తాను కెప్టెన్సీ వహిస్తున్న మెల్​బోర్న్ స్టార్స్​ను ఫైనల్​ వరకు తీసుకెళ్లాడు. రన్నరప్​తో సరిపెట్టుకుందీ జట్టు.

వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్​ కోసం సిద్ధమవుతున్నాడు మ్యాక్స్​వెల్. ఇందులో కింగ్స్​ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడనున్నాడు.

Last Updated : Mar 2, 2020, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.